ETV Bharat / state

'కొవిడ్​ ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి' - vizianagaram collectorate news

కొవిడ్​ ఆస్పత్రుల్లో వసతులు పెంచాలని డిమాండ్​ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆందోళనకారులు మండిపడ్డారు.

protest under cpm
విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా
author img

By

Published : Apr 20, 2021, 8:35 AM IST

విజయనగరం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కరోనా బాధితులకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో వసతులు పెంచాలని ఆందోళనకారులు డిమాండ్​ చేశారు. రెండో దశలో కొవిడ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా వసతులు పెంచటం లేదన్నారు.

కరోనా వైద్య పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వసతులు మెరుగుపరిచేలా, కొవిడ్​ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు పరిశ్రమ... కొవిడ్ రోగుల పాలిట ప్రాణదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.