ETV Bharat / state

ఆస్తివిలువ ఆధారిత ఇంటిపన్నును నిరసిస్తూ ఆందోళన - vizianagaram latest news

విజయనగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆస్తివిలువ ఆధారిత ఇంటిపన్నును అమలు చేయవద్దని డిమాండ్ చేశారు. ఆర్థిక వనరులను సమీకరించుకోవడం కోసం ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు.

protest in vizianagaram to demand cancelation of assets tax in the state
ఆస్తివిలువ ఆధారిత ఇంటిపన్నును నిరసిస్తూ ఆందోళన
author img

By

Published : Jun 27, 2021, 3:42 PM IST

ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్త పన్నును నిరసిస్తూ... విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆర్థిక వనరులను సమీకరించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులను ఉపయోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెబుతున్న సర్కార్... ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. సంక్షేమ పథకాల ఖర్చును భర్తీ చేసుకోవడం కోసం ప్రజల మీద భారం మోపుతున్నారని మండిపడ్డారు.

ఇదీచదవండి. suicide: కుటుంబ కలహలతో గర్భిణి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.