ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నం నాయుడు తెలిపారు. జిల్లాలో శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ప్రారంభమై... గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల మీదగా సాగుతుందని వెల్లడించారు. అధికారంలోకి రాక ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను వైకాపా మోసం చేసిన విధానం, రాష్ట్రంలో సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై తమ నేత గళం విప్పుతారని ఆయన అన్నారు. అధికార పార్టీ ఆగడాలపై ప్రజల్లో చైతన్యం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని చిన్నం నాయుడు తెలిపారు.
27న విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్యయాత్ర - ప్రజా చైతన్య యాత్ర వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల27న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. అదే రోజూ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొననున్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన గళం విప్పనున్నారు.

ఇదీ చదవండి