విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగలవలస వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... ఓ లారీలో 1400 కేజీల గంజాయిని భోగాపురం సీఐ శ్రీధర్ స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. దీని విలువ సుమారు కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇదీచూడండి.విశాఖలో 198 కేజీల గంజాయి స్వాధీనం