ETV Bharat / state

అమ్మాయిని వశపరుచుకునే మందుకోసం.. చోరీలకు పాల్పడిన మైనర్ బాలుడు - ఏపీ వార్తలు

Theft Gang Arrested: అమ్మాయి ప్రేమ పొందడం కోసం దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు ఓ మైనర్. తన స్నేహితుడికి వీడియో కాల్ చేసి.. అతను ఎలా చేయమంటే అలా దొంగతనాలు చేసేవారు. చెడు వ్యసనాలకు బానిసైన ఆ స్నేహితుడు.. మైనర్​తో పాటు మరికొంత మందితో చోరీలు చేయించి.. ఆ సొమ్మును తన అవసరాలకోసం వాడుకోవాలని అనుకున్నాడు.

Theft Gang Arrested
చోరీ ముఠా అరెస్ట్
author img

By

Published : Jan 30, 2023, 12:36 PM IST

Theft Gang Arrested: విజయనగరం జిల్లా బొబ్బిలిలో పలు దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి చోరీకి గురైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మైనర్ కూడా ఉన్నాడు. మైనర్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కాదనేది. ఆమె ప్రేమను పొందడం ఎలా అని స్నేహితుడ్ని సలహా అడిగాడు. ఒడిశాలో అమ్మాయిని వశపరుచుకునే మందు ఉందని.. దాని ధర లక్ష రూపాయలకు పైగా ఉందని చెప్పాడు. దీంతో దాని కొనుగోలుకు సిద్ధమయ్యాడు. మందు కొనేందుకు డబ్బు లేకపోవడంతో.. ఆ స్నేహితుడి సలహాల ప్రకారం చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.

ఈ కేసుపై సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బొబ్బిలిలో గత ఏడాది డిసెంబర్ 3న.. నవంబర్ 11న వరుస చోరీలకు పాల్పడింది పల్లెవీధికి చెందిన కె.కిరణ.. ఎం మనోహర్​లని తెలిసి వారిని అరెస్టు చేశామన్నారు. ఎం మురళీకృష్ణ అలియాస్ నాని పరారీలో ఉన్నట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై.. అమ్మాయిల్ని వశపరుచునే మందు దొరుకుతుందని స్నేహితుడ్ని తప్పుదారి పట్టించిన కిరణ్.. తొలుత ఆన్​లైన్ జూదాలు, చెడు వ్యసనాలతో అప్పులపాలు అయ్యాడు. వాటిని తీర్చేందుకు మైనర్​తో దొంగతనాలు చేయించేవాడు. వీరంతా రాత్రి పూట వీడియో కాల్ ద్వారానే చేరీలకు పాల్పడేవారు. కిరణ్​కు వీడియోకాల్ చేసి.. మిగిలిన వారు అతడు చెప్పినట్టు బీరువా తాళాలు తీయడం, గ్లౌజులు వేసుకోవడం చేసేవారని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.