ETV Bharat / state

ఆస్తి కోసం పిన్ని హత్య.. కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Nov 1, 2020, 11:27 AM IST

ఇంటి కోసం సొంత పిన్నినే హతమార్చాడు. విజయనగరం జిల్లా భోగాపురంలో చోటు చేసుకున్న హత్య కేసును పోలీసులు చేధించారు. ఇంటి కోసమే పిన్నిని గొంతు నులిమి చంపినట్లు నిందితుడు వివరించాడు. కేసును త్వరగతిన విచారణ చేపట్టిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.

Police beaten woman murder case
మహిళా హత్య కేసును చేధించిన పోలీసులు

ఆస్తి కోసం రక్త సంబంధాన్నే కాదనుకున్నాడు. తాను ఉంటున్న ఇంటిని సొంతం చేసుకోవడానికి సొంత పిన్నినే హతమార్చాడు. గతనెల 27న భోగాపురంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వీరాంజనేయరెడ్డి శనివారం విలేకర్లకు తెలియజేశారు. భోగాపురం పంచాయతీ కొమ్మూరువీధిలో ఆళ్ల జయలక్ష్మి(65) మృతిపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం వచ్చిన వివరాల ప్రకారం హత్యగానే భావించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులే కాజేసి ఆమెను చంపి ఉంటారన్న అనుమానం మొదట్లో వచ్చినప్పటికీ అదే ఇంట్లో ఉంటున్న సొంత అక్క కొడుకు విజయ్‌కుమార్‌పై అనుమానం రావడంతో అదేరోజు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా నేరం ఒప్పుకొని లొంగిపోయాడు. తొలుత ఇంటికోసం గొడవ పడడం నిజమేనని, ఆ కోపంలో పిన్నిని కొట్టగానే పడిపోయిందన్నాడు. అనంతరం గొంతునులిమి చంపేశానని, నేరం తన మీదకు రాకూడదనే ఉద్దేశంతో చెవిదిద్దులు తీసి బీరువాలో పెట్టానని అతను పోలీసులకు వివరించాడు. ఈ కేసును ఛేదించిన సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ మహేష్‌, ఏఎస్‌ఐ రాజు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇవీ చూడండి...

ఉత్తరాంధ్ర అభివృద్ధి భాజపాతోనే సాధ్యం - సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.