ETV Bharat / state

'చమురు ధరలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి'

author img

By

Published : Feb 20, 2021, 3:40 PM IST

పెంచిన చమురు ధరలను తగ్గించాలని కోరుతూ... విజయనగరం జిల్లా కొమరాడలో ప్రజలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. హద్దు అదుపు లేకుండా కేంద్ర ప్రభుత్వం.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచడం అన్యాయమని వాపోయారు.

People staged a protest under the auspices of CITU in Komarada, Vizianagaram district, demanding reduction in oil prices
'పెరుగుతున్న చమురు ధరలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి'

విజయనగరం జిల్లా కొమరాడలో... పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ... సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రజలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గేదెపై గ్యాస్ సిలెండర్ పెట్టి వినూత్న రీతిలో ఆందోళన చేశారు. హద్దు అదుపు లేకుండా చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడం అన్యాయమని పేర్కొన్నారు.

చమురు రేట్లు పెరగడంతో.. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు బస్సు, రైలు ఛార్జీలు పెరిగి సామాన్య ప్రజల నడ్డి విరిచే పరిస్థితి ఏర్పడుతుందని సీఐటీయూ మండల నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. రెండు నెలల్లో గ్యాస్ ధరను వంద రూపాయలకు పైగా పెంచారని చెప్పారు. లాక్​డౌన్​ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారి పరిస్థితి.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా తయారైందని పేర్కొన్నారు.

ఇష్టమొచ్చినట్లు పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచుతున్న చమురు కంపెనీల యాజమాన్యాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని సాంబమూర్తి డిమాండ్ చేశారు. ధరల నియంత్రణపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో అన్ని వర్గాల వారితో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'విద్యార్థుల‌ను సొంత పిల్ల‌ల్లా చూసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.