విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచారు. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్ధులు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించారు.
గణేశ్‌నగర్ కాలనీకి చెందిన తేలు శ్వేత గాయత్రి.. ఆల్ ఇండియా స్థాయిలో 40, ఓబీసీ విభాగంలో 6వ ర్యాంకు సాధించింది. మొత్తం 720 మార్కులకుగాను 705 మార్కులు సాధించింది. శ్వేత విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో చదువుకుంది. ఆమె తల్లిదండ్రులు పార్వతి, నరసింహ మూర్తి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివాని వలస.. ఉద్యోగరీత్యా పార్వతీపురంలో స్థిరపడ్డారు.
అదే కాలనీకి చెందిన బడే నిఖిల్ శేషాద్రి నాయుడు ఆలిండియా స్థాయిలో 387.. ఓబీసీ విభాగంలో 95వ ర్యాంకు సాధించాడు. మొత్తం 685 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు నిర్మల కుమారి, గౌరీ నాయుడు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. పిల్లలు ర్యాంకులు సాధించడం పట్ల కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: