ETV Bharat / state

మరుగున పడ్డ మానవత్వం.. వైద్యం అందక వృద్ధుడి నరకయాతన - విజయనగంలో వృద్ధుడి యాతన

'అయ్యా.. మూడు రోజుల నుంచి ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా... వైద్యులను అయ్యా అని వేడుకుంటున్నా కనికరించలేదు.. నడవలేక... పాకుకుంటూ వైద్యం కోసమని వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు... కరోనా ఉంది.. బయటకు పో అంటున్నారే తప్ప మందు బిళ్లయినా ఇవ్వడం లేదు'.. ఇదీ వైద్యం అందక ఓ వృద్ధుడు పడుతున్న నరక యాతన.

old man difficulties due to lack of treatment at vijayanagaram
వైద్యం లేక వృద్ధుడి నరకయాతన
author img

By

Published : Jul 24, 2020, 11:44 AM IST

శరీరమంతా గాయమైనట్లు రక్తం కారుతోంది.. వైద్యం కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా వైద్యులు స్పందించలేదు.. ఆకలేస్తోంది కనీసం మంచి నీరైనా ఇవ్వండంటూ దారిన పోయే వారిని వేడుకున్నా ఒక్కరు కూడా స్పందించకపోవడం ఆవేదన కలిగించే విషయం. ఈ సంఘటన విజయనగరంలోని కేంద్రాసుపత్రి ఎదుట చోటు చేసుకుంది. వృద్ధుడికి శరీరమంతా గాయమైనట్లు రక్తం కారుతోంది. చికిత్స కోసం కుష్ఠు వ్యాధి ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వారు లోపలికి రానివ్వలేదు. దీంతో అలాగే పాకుకుంటూ కేంద్రాసుపత్రికి రాగా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శరీరం నిస్సత్తువతో అక్కడే పడుకుండి పోయాడు.

ఇదే సమయంలో పట్టణానికి చెందిన మన్యాల శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి పని నిమిత్తం అక్కడికి వచ్చారు. వృద్ధుడి పరిస్థితిని గమనించి మంచినీరు అందించారు. అంబులెన్సులో చెల్లూరు లెప్రసీ మిషన్‌కు తరలించారు. అక్కడ మిషన్‌ ఎత్తేశారని తెలిసి తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. వైద్యులను సంప్రదించి చికిత్స అందేలా చూశారు. సిబ్బంది చక్రాల కుర్చీలో తీసుకొచ్చి ఆవరణలోని చెట్టు కింద విడిచి వెళ్లారు. ఆ వృద్ధుడు తన పేరు ప్రభాకర్‌ అని, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, నిమ్మాడగా చెబుతున్నాడని అక్కడి వారు తెలిపారు.

ఇదీ చదవండి: 'అలాంటి పరిస్థితి వస్తే మేం చూసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.