ఒడిశా-ఆంధ్రా సరిహద్దులోని కొఠియా గ్రామాలకు (kotia villagers) సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొఠియా ప్రాంతంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన 15 మందికి కొరాపుట్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు జారీ చేసింది. ఈ 15 మంది కొఠియా గిరిజనులను ప్రలోభపెట్టి,ఆంధ్రాకు మద్దతు పలకాలని ఒత్తిడి తెస్తున్నారని అందులో పేర్కొంది. నవంబరు 22న ఉదయం 11 గంటలకు ఎగ్జిక్యూటివ్ మెజ్యిస్టేట్ ఎదుటహాజరు కావాలని తెలియజేయగా, వీరు హాజరు కాలేదని సమాచారం.
ఇదీ చదవండి