విజయనగరం జిల్లా జియ్యమ్మవలస గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్ తోటపల్లి సుజాత మేట్లతో కుమ్మక్కై... డబ్బులు ఇచ్చిన గ్రూపులకు ఎక్కువ కూలీ వేస్తున్నారని ఆరోపించారు. వలస కూలీలు, కంపెనీల్లో పనిచేసే వారు, విద్యార్థుల పేర్లతో సుమారు వెయ్యి మందికి.. పనికి రాకుండానే ఎన్నెమ్మార్లు రాస్తున్నారనీ..., వారి పేరున గత కొన్ని సంవత్సరాలుగా బిల్లులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: 'మాన్సాస్ ఆస్తులు కాజేసే కుట్ర చేస్తున్నారు'