ETV Bharat / state

తోటపల్లి బ్యారేజీ 4 గేట్లు ఎత్తిన అధికారులు - Vizianagaram district rain updates

విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగావళి నదికి ప్రవాహం పెరిగింది. అధికారులు అప్రమత్తమయ్యారు. తోటపల్లి బ్యారేజీ 4 గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు పంపిస్తున్నారు.

Thotapalli Barrage
తోటపల్లి బ్యారేజీ
author img

By

Published : Aug 17, 2021, 9:49 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్​లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదుల్లో ప్రవాహం ఎక్కువైంది. ప్రధానంగా ఒడిశాతో పాటు ఆంధ్ర ఎగువ భాగంలో వర్షాలు పడుతున్న కారణంగా.. నాగావళి నదిలో ప్రవాహం పెరిగింది.

తోటపల్లి బ్యారేజ్ వద్ద నీటి నిల్వలు పెరగిన కారణంగా అధికారులు 4 గేట్లను ఎత్తివేశారు. పై నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులు తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇదీ చదవండి:

Ramya Murder: అట్టుడుకిన గుంటూరు.. రమ్య మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.