విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పురపాలక ప్రత్యేకాధికారి సంయుక్త కలెక్టర్ వెంకట్రావు, పురపాలక కమిషనర్ ఎమ్ఎమ్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి.. సూచనలు అందించారు.
బొబ్బిలి పురపాలక సంఘంలో 31 వార్డులు ఉండగా.. 11వ వార్డులు ఏకగ్రీవం కావటంతో, 30 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌కు సంబంధించి 15 రౌండ్లను ఏర్పాటు చేయగా... ఒక్కో రౌండ్లో రెండు వార్డుల ఫలితాలు వచ్చేటట్లు ఏర్పాట్లు చేపట్టారు. పురపాలక కౌన్సిల్ హాల్లోనే కౌంటింగ్ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ విధానాన్ని చూసేందుకు బారీ తెరలను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: