అయోధ్య మైదానానికి బయట వ్యక్తులు వాకింగ్‌కు వెళ్లొద్దంటూ.. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు తీసుకున్న నిర్ణయంతో మాన్సాస్‌లో మరో వివాదం మెుదలైంది. విజయనగరం పట్టణంలో ఉన్న అయోధ్య మైదానాని(ఎమ్మార్ కాలేజీ స్టేడియం)కి ఈ రోజు ఉదయం తాళాలు వేయించారు. ఎమ్మార్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు తప్ప మిగిలిన వారు లోపలకు వెళ్లకూడదని సంచైత లేఖ విడుదల చేశారు. సంస్థ నిర్ణయం పట్ల ఎన్నో ఏళ్లుగా మైదానంలో వాకింగ్ చేస్తున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'రాజ్యాంగ విచ్ఛిన్నం'పై విచారణ ఆపేది లేదు: హైకోర్టు