ETV Bharat / state

'ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం ఏమి చేస్తున్నారు?' - రామతీర్థం ఘటన తాజా వార్తలు

రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్​ ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రామ్మోహన్​ నాయుడు ప్రశ్నించారు. ఆలాయాల్లో విగ్రహాలకూ రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

ram mohan naidu on rama theertham
ram mohan naidu on rama theertham
author img

By

Published : Jan 2, 2021, 7:05 PM IST

రామతీర్థం ఘటనపై మాట్లాడుతున్న రామ్మోహన్​ నాయుడు

రామతీర్థం ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. 150 ఆలయాలపై దాడులు జరిగితే సీఎం జగన్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కొండపైన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో రామ్మోహన్​ నాయుడు మాట్లాడారు. వైకాపా పాలన ఇలాగే ఉంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని అన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే వైకాపా పనిగా పెట్టుకుందని విమర్శించారు. పోలీసులు కూడా చట్టప్రకారం నడుచుకోవాలని ఎంపీ రామ్మోహన్​ నాయుడు హితవు పలికారు.

ఇదీ చదవండి: సీఎం విజయనగరం వచ్చినా.. రామతీర్థం ఘటనపై ఎందుకు మాట్లాడలేదు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.