విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బందికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైకాపా నేతలు మజ్జి చిన్న శ్రీను, వలిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సిబ్బంది సమర్థంగా పనిచేస్తున్నారని.. వాలంటీర్ల వ్యవస్థను పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఎంపీ బెల్లాన తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోయినా.. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి..