Suicide attempt: ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన విజయనగరం జిల్లాలోని జమ్మునారాయణపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జమ్ము నారాయణపురంలోని.. సాయి కుటీర్ అపార్ట్ మెంట్లో దుర్గ కుటుంబం నివాసం ఉంటోంది.
ఈరోజు ఉదయం వాళ్ల ఇంటి నుంచి.. అరుపులు వినిపించడం, పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పరిగెత్తుకెళ్లి చూడగా.. 28 ఏళ్ల దుర్గతోపాటు ఆమె ఇద్దరు పిల్లలు ఏడేళ్ల గౌతమ్, ఐదేళ్ల మానస మంటల్లో కాలిపోతున్నారు.
స్థానికులు వారిని రక్షించేలోగానే తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని 108 వాహనంలో.. విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు సమాచారం.
ఇదీ చదవండి: Father and Son Suicide Attempt: కలెక్టరేట్‌లో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం