చెరకు రైతుల(sugar farmers) అవేదనను అర్థం చేసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satyanarayana) అన్నారు. లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులు తిరగబడటంలో తప్పు లేదన్న మంత్రి... పరిశ్రమ నుంచి 30 వేల బస్తాల చక్కెరను స్వాధీనం(seize) చేసుకున్నట్లు తెలిపారు. రూ.16 కోట్ల మేర బకాయిల(dues)ను ఎలా తీర్చాలో ఆలోచన చేస్తామని చెప్పారు. ఆర్ఆర్ యాక్ట్(rr act) కింద కంపెనీ యాజమాన్యానికి ఉన్న 24 ఎకరాల భూమిని అమ్మి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
రైతులు చేసిన ఆందోళన(protest)లో రాళ్లతో దాడిచేసినా పోలీసులు సంయమనం పాటించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బంద్‌కు పిలుపు దృష్ట్యా ముఖ్య నాయకుల ముందస్తు అరెస్టులు(arrests) జరిగాయన్నారు. ఫ్యాక్టరీ పరిధిలో వస్తున్న 80 వేల టన్నుల చెరుకు దిగుబడిని ఎక్కడ కొనుగోలు చేపట్టాలో ఆలోచిస్తున్నామని వివరించారు.
ఏం జరిగిందంటే...
బకాయిలు చెల్లించాలంటూ విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద చెరకు రైతుల ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతు నాయకుల అరెస్టుకు నిరసనగా పోలీసులపై ఎదురుతిరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. గత రెండు సీజన్లకు సంబంధించి కర్మాగారం పరిధిలోని 2400 మంది రైతులకు యాజమాన్యం రూ.16.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో పలు గ్రామాల రైతులు ర్యాలీగా కర్మాగారం ప్రధానద్వారం వద్దకు చేరుకుని ఎదుట నిరసన చేపట్టారు. యాజమాన్యం, ప్రభుత్వ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు సమీపంలోని 36వ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పార్వతీపురం-బొబ్బిలి మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
వర్షం కురుస్తున్నా ఆగని ఆందోళన...
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. రైతుసంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణమూర్తి, మరో అయిదుగుర్ని అరెస్టు చేసి బొబ్బిలి పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. ఆగ్రహించిన రైతులు చేతికి దొరికిన మట్టిపెళ్లలు, కొబ్బరిమట్టలతో పోలీసులపై దాడికి దిగారు. సీతానగరం ఎస్సై బి.మురళి, మహిళా కానిస్టేబుల్ పద్మలకు గాయాలయ్యాయి. వారిని బొబ్బిలి, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించి, అక్కడ మిగిలిన పోలీసులు కర్మాగారంలోకి పరుగులు తీశారు. వర్షం పడుతున్నా రైతులు పరదాలు కప్పుకొని మరీ నిరసన తెలిపారు. సుమారు అయిదు గంటల తర్వాత జేసీ కిశోర్‌కుమార్, బొబ్బిలి డీఎస్పీ మోహనరావు రైతు నాయకులతో చర్చించడంతో శాంతించారు. జనవరి 15 లోగా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జేసీ రైతులకు హామీ ఇవ్వగా అందుకు వారు అంగీకరించలేదు.
అనుబంధ కథనాలు..
Farmers Protest: తిరగబడ్డ చెరకు రైతు.. తమపై దాడికి వచ్చిన పోలీసులను తరిమికొట్టి..
Remond: చెరుకు రైతుల ఆందోళనలో అరెస్టైన నేతలకు 14 రోజుల రిమాండ్
అన్నం పెట్టే అన్నదాతలపై అక్రమ కేసులా..? : చంద్రబాబు
పోలీసుల తీరును నిరసిస్తూ రైతు సంఘాల బంద్.. నాయకుల ముందస్తు అరెస్టులు