ETV Bharat / state

ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్ విద్య మూసివేతకు రంగం సిద్ధం..! - Minister Bosta satyanarayana news

విజయనగరం ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్ విద్య మూసివేతకు రంగం సిద్ధమైంది. ఇంటర్ మూసివేత విషయం మాన్సాస్ ట్రస్టు ప్రభుత్వానికి తెలిపింది. మాన్సాస్‌లో జరుగుతున్న వివాదాలు కుటుంబ తగాదాలు అని...మాన్సాస్‌ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని మంత్రి బొత్స చెప్పారు.

Minister Bosta satyanarayana Visit MR college
ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన మంత్రి బొత్స
author img

By

Published : Oct 26, 2020, 4:37 PM IST

విజయనగరంలో మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ కళాశాలలో ఇంటర్ విద్య మూసివేతకు రంగం సిద్ధమైంది. ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు సైతం నిలిపివేస్తూ ప్రకటన సైతం చేసింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డుతో పాటు...ప్రభుత్వానికి తెలియచేసింది ట్రస్టు పాలకవర్గం. ఈ నేపథ్యంలో... విద్యార్ధుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు.... ప్రత్యామ్నాయంగా విజయనగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. కలెక్టర్ హరి జవహర్ లాల్, ఇంటర్ బోర్డు అధికారులతో కలసి... కళాశాలలో ప్రస్తుతం ఉన్న విద్యార్ధుల సంఖ్య, ఖాళీలు, అధ్యాపకుల అవశ్యకత తదితర వివరాలను మంత్రి తెలుసుకున్నారు.

అవి వారి కుటుంబ తగాదాలు: మంత్రి బొత్స

ఎంఆర్ కళాశాలలో ఇంటర్ విద్యను మూసివేస్తున్నట్లు మాన్సాస్ ట్రస్టు ప్రభుత్వానికి తెలియజేసినట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో విద్యార్ధులు నష్టపోకుండా...విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియచేశారు. మాన్సాస్ వివాదాలపై స్పందిస్తూ.... అవి కుటుంబ తగాదాలన్నారు. ఆ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్ఠం చేశారు. ఆస్తులు అన్యాక్రాంతం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మంత్రి బొత్స తెలిపారు.

ఇదీ చదవండి: అమరావతిలోనే రాజధాని ఉండాలి: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.