ETV Bharat / state

ఎన్ని విమర్శలు చేసినా.. ఆ విషయంలో రాజీపడబోం: మంత్రి బొత్స - మంత్రి లెటేస్ట

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌ట్ల‌ త‌మ ప్ర‌భుత్వం అంకిత‌భావంతో ప‌నిచేస్తోంద‌ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకోసమే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. పేదల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని చెప్పారు.

వారెన్ని విమర్శలు చేసినా.. ఆ విషయంలో రాజీపడబోం

author img

By

Published : May 7, 2022, 7:56 PM IST

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా..పేదల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం రాజీపడదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, తుమ్మికాపల్లిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తుమ్మికాపల్లిలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ.1.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్న బొత్స.. సచివాలయ వ్యవస్థ పనితీరు, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలను ప్రశంసించిన ఆయన.. సచివాలయ వ్యవస్థ తమ ప్రభుత్వానికి కళ్లు, చెవులలాంటివని కొనియాడారు. కుల‌, మ‌త‌, వ‌ర్గ విభేదాల్లేకుండా.., పార్టీల‌కు అతీతంగా అర్హులంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతాయ‌ని మంత్రి వెల్లడించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌ట్ల‌ త‌మ ప్ర‌భుత్వం అంకిత‌భావంతో ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. అందుకోసమే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చినట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.