అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, యనమల రామకృష్ణుడు ట్విట్టర్ ద్వారా కొత్త అవతారం ఎత్తారని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా అభివృద్ధిపై సహచర మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించిన బొత్స... తెలుగుదేశం నేతల తీరుపై మండిపడ్డారు. గత ఐదేళ్లలో రాజధాని నిర్మించకుండా ఏం చేశారని నిలదీశారు. అమరావతిలో నాలుగు భవనాలు తప్ప ఏమీలేదని... శ్మశానంలా తయారుచేశారని మంత్రి బొత్స వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి : నాలుగు భవనాలు తప్పితే అమరావతిలో ఏముంది..? మంత్రి బొత్స