ETV Bharat / state

Collector review: బోధనాసుపత్రి శంకుస్థాపన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

విజయనగరంలో కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రికి సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కలెక్టర్​ హ‌రిజ‌వ‌హ‌ర్​లాల్ ఆ ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని శాఖలు స‌మ‌న్వ‌యంతో పనులు పూర్తి చేయాలని సూచించారు.

collector harijawaharlal
బోధనాసుపత్రి శంకుస్థాపన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
author img

By

Published : May 27, 2021, 9:20 PM IST

విజయనగరంలో ప్ర‌భుత్వ వైద్య‌క‌ళాశాల నిర్మాణానికి.. ఈ నెల 30న సీఎం జ‌గ‌న్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిజ‌వ‌హ‌ర్​లాల్ ఏర్పాట్లపై సమీక్షించారు(Collector review). ఈ నెల 30న ఉదయం 11 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి ఆన్‌లైన్ ద్వారా బోధ‌నాసుప‌త్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తార‌ని కలెక్టర్​ వెల్లడించారు.

క‌ళాశాల నిర్మాణానికి గాజుల‌రేగ‌ వ‌ద్ద సేక‌రించిన స్థ‌లంలోనూ, క‌లెక్ట‌రేట్ వీడియో కాన్ఫ‌రెన్స్ వ‌ద్ద త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని రెవెన్యూ అధికారులకు సూచించారు. అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిక‌రాలను ముందుగానే సిద్దం చేయాల‌న్నారు. కార్య‌క్ర‌మానికి నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేట‌ట్లు చూడాల‌ని ట్రాన్స్​కో అధికారులకు తెలిపారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌న్నీ స‌మ‌న్వ‌యంతో తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

20 రోజులుగా స్థిరంగా తగ్గుతున్న కరోనా

'పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.