విజయనగరం జిల్లా సాలూరు మండలం ఆంధ్ర ఒడిశా వివాదాస్పద గ్రామాలలో ఒకటైనా నేరెళ్లవలసలో.. ప్రతి మంగళవారం సంత నిర్వహిస్తారు. తాము పండించుకునే పంటలను అమ్ముకుని వంట సరుకులు కొనుక్కుని వెళుతుంటారు. గిరిజనులు ఆంధ్ర సంతకు వస్తే.. ఆ రాష్ట్రం వైపే మొగ్గు చూపిస్తారని ఒడిశా ప్రభుత్వం కొటియాలో గురువారం సంత ఏర్పాటు చేసింది. అయినా గిరిజనులు మాత్రం.. మంగళవారం సంతకు రావటానికి ప్రాధాన్యత చూపించారు. దీంతో.. స్థానిక ఎమ్మెల్యే రాజన్న దొర పీవో అధికారులతో కలిసి గిరిజనులకు ఉపయోగపడే మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం.. దొరల తాడివలస గ్రామంలో.. రూ.16లక్షలతో ఉమెన్స్ సెల్ఫ్ హెల్త్ గ్రూప్ ఫెడరేషన్ భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనుల కోసం ముఖ్యమంత్రి జగన్ ఎల్లవేళలా కృషిచేస్తారని.. ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: Attack: గంజాయి పంట ధ్వంసం చేసేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనుల దాడి