ETV Bharat / state

మన్యం జిల్లా ఏర్పాటుకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు - మన్యం జిల్లా ఏర్పాటుకు సర్వం సిద్ధం

పార్వతీపురం కేంద్రంగా నూతనంగా ఏర్పడుతున్న మన్యం జిల్లా ఏర్పాట్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి పరిశీలించారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రులు వ్యాఖ్యనించారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు.

మన్యం జిల్లా ఏర్పాటుకు సర్వం సిద్ధం
మన్యం జిల్లా ఏర్పాటుకు సర్వం సిద్ధం
author img

By

Published : Apr 3, 2022, 8:36 PM IST

పార్వతీపురం కేంద్రంగా నూతనంగా ఏర్పడుతున్న మన్యం జిల్లా ఏర్పాట్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి పరిశీలించారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఐటీడీఏ నూతన భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. బాలికల ఆర్​సీఎం పాఠశాల భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి కేటాయించగా.. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రులు వ్యాఖ్యనించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. కొత్త జిల్లాలో ఉన్న రెండు ఐటీడీఏలూ కొనసాగుతాయని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. తుది నోటిఫికేషన్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.