మాన్సాస్ ట్రస్టు బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతూ కార్య నిర్వహణాధికారి (ఈవో) డి.వెంకటేశ్వరరావు.. ప్రభుత్వానికి లేఖ రాశారు. డిప్యుటేషన్ సమీపిస్తున్నందున మాతృశాఖకు (రెవెన్యూ) పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నానని ఆయన వెల్లడించారు. గతేడాది అక్టోబరు 23న ట్రస్టు ఈవోగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.
సింహాచలం ఈవోగా పనిచేసిన వారే గతంలో ట్రస్టుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహించేవారు. పూర్తిస్థాయిలో ఈవోగా ఈయనే నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 22వ తేదీతో ఆయన డిప్యుటేషన్ ముగియనుంది. ట్రస్టు విద్యా సంస్థల ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకుల నుంచి నగదును ఉపసంహరించుకునే సమయంలో ఖాతాలను స్తంభింపజేస్తూ ఈవో రాసిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:
School timings : పాఠశాలల పనివేళలు పెంపు... విద్యా సంవత్సరంలో 188 పని దినాలు