ETV Bharat / state

తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడి విఫలయత్నం.. కానీ - corona deaths in vizianagaram

కరోనా బారినపడి ఊపిరాడక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని రక్షించుకునేందుకు కుమారుడు చివరి వరకు పోరాడాడు. కానీ ఆ పోరాటంలో ఓడిపోయాడు. తన కళ్లముందే తండ్రి మృతి చెందాడు. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

man died with corona in front of his son
తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు కుమారుడి విఫలయత్నం
author img

By

Published : May 8, 2021, 7:30 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామానికి చెందిన ఆల్తి సూర్యనారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇటీవల కరోనా సోకడంతో హోం ఐసోలేషన్​లో చికిత్స పొందాడు. ఈ క్రమంలో సూర్యనారాయణకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం ఎంఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సూర్యనారాయణ పరిస్థితి విషమించింది.

ఎలాగైనా తండ్రిని కాపాడుకునేందుకు సూర్యనారాయణ కుమారుడు శత విధాలా ప్రయత్నించాడు. తెలిసిన వారిని సంప్రదించి ఆక్సిజన్ బెడ్ కోసం విఫలయత్నం చేశాడు. చివరికి కొడుకు ఒడిలోనే సూర్యనారాయణ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. గుండెలు పిండేసేలా ఉన్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు కుమారుడి విఫలయత్నం

ఇదీచదవండి.

కడప పేలుడు ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.