విజయనగరం పట్టణంలోని కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయం వద్ద విద్యార్థుల నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మహారాజా కాలేజీ ప్రైవేటీకరణ అంశాన్ని పరిశీలించాలంటూ మాన్సాస్ ఛైర్పర్సన్ సంచైతా గజపతిరాజు లేఖ రాయడాన్ని నిరసిస్తూ వివిధ సంఘాలు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నాయి.
ఈ రోజు విజయనగరం కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టేందుకు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను అరెస్ట్ చేసి వాహనాల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు.
ఇవీ చదవండి..