Demolition of Houses in LB Colony and Boggula Dibba: విజయనగరం ఎల్బీ కాలనీ, బొగ్గులదిబ్బలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. ఎల్బీ కాలనీలోని 20 మందికి సారిపల్లి టిడ్కో కాలనీలో ఇళ్లు కేటాయించారు. బొగ్గుల దిబ్బలో 70 కుటుంబాలకు జగనన్న లేఔట్లలో స్థలాలు మంజూరు చేశారు. బొగ్గుల దిబ్బలోని తాత్కాలిక నివాసాలు ఖాళీ చేయాలంటూ నగరపాలక సంస్థ అధికారులు జేసీబీలతో వచ్చారు. ఇళ్ల కూల్చివేత ప్రారంభించటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికి పోవాలంటూ స్థానికులు అధికారులను నిలదీశారు. బాధితులకు ప్రజా సంఘాలు, సీపీఎం, తెలుగుదేశం నాయకులు సంఘీభావం తెలిపారు. కూల్చివేతకు అడ్డొచ్చిన స్థానికులు, ప్రజా సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ పార్టీల నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
"మీరు ఎక్కడ ఉంటే అక్కడ పట్టాలు ఇస్తామని మాకు జగన్ గారు చెప్పారు. అక్కలు, చెల్లెల్లు అని నోటికొచ్చినట్టు అప్పుడు మాట్లాడి.. ఇప్పుడేమో పేదవారికి ఉన్న గుడిసెలు కూడా తీయించాలని చూస్తున్నారు. నోటీసులు కానీ.. వచ్చి చెప్పడం కానీ ఏం చేయలేదు". - లక్ష్మీ, బొగ్గులదిబ్బ, విజయనగరం
"సంక్రాంతి వరకూ వాళ్లు టైమ్ అడిగారు. తరువాత వెళ్లిపోతాం అన్నారు. గత నెల 20వ తేదీ వరకూ మేము టైమ్ ఇచ్చాం. కానీ అప్పుడు రాలేదు. ఈ టైమ్లో కొంత మంది కోర్టులో కేసు వేశారు. తాళాలు ఇచ్చిన వారిని మాత్రమే మేము ఖాళీ చేపిస్తున్నాం". - ధనలక్ష్మి, 40డివిజన్ కార్పొరేటర్
ఇవీ చదవండి: