విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి నెమ్మదిగా ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూలు మొదలయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జిల్లా సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు తీసుకోవాల్సిన చర్యలపై కౌంటింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 10.30 సమయానికి 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం