కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. గ్రామాలు అల్లకల్లోలం అవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలో ప్రజలు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకున్నారు. ఎవరైనా మాస్క్ లేకుండా తిరిగితే ఫొటోలు తీసి పోలీసులకు పంపిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో మార్కెట్లు, కార్యాలయాలు బంద్
మధ్యాహ్నం 2 గంటల తర్వాత వ్యాపార సముదాయాలు మూసివేయాలని గ్రామస్థులు నిర్ణయించారు.వైద్య అవసరాల కోసం మినహా మరే ఇతర దుకాణాలు తెరవకూడదని తీర్మానించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ గార్ల సుజాత, తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, వ్యాపారసంఘ నాయకులు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాతో విజయనగరం సీసీఎస్ డీఎస్పీ మృతి