ETV Bharat / state

Scholarships Issue: అందని స్కాలర్​షిప్​లు.. వెళ్లిపోతున్న విద్యార్థులు.. స్పందనలో ఫిర్యాదు - ఉపకార వేతనాలు

Scholarships Issue: రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విద్యార్ధులకు ఉపకార వేతనలు మంజూరు చేయకపోవటంతో.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ.. స్పందనలో ఫిర్యాదు చేశారు.

Scholarships Issue
Scholarships Issue
author img

By

Published : May 23, 2023, 4:06 PM IST

Scholarships Issue: సరైన సమయంలో ఫీజులు కట్టకపోతే.. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీ పట్టభద్రులకు సంబంధిత కళాశాలల యజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవటం విన్నాం. అయితే విజయనగరం జిల్లాలో అందుకు భిన్నంగా జరిగింది. జిల్లాలోని కోరుకొండ సైనిక్ పాఠశాల విద్యార్ధులకు సకాలంలో ఉపకార వేతనాలు అందక.. ఫీజులు చెల్లించలేక.. పాఠశాల నుంచి విద్యార్థులే టీసీలు వెనక్కి తీసుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం కోరుకొండ సైనిక్ పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రుల సంఘం.. స్పందనలో కలెక్టర్​కు వినతి పత్రం అందచేశారు.

సైనిక్ పాఠశాల విద్యార్ధులకు ఉపకార వేతనాలను సకాలంలో అందించే విధంగా చర్యలు చేపట్టాలని వారు అధికారులకు విన్నవించారు. ఉపకార వేతనాల్లో కేంద్రం వాటా మంజూరు కాగా.., రాష్ట్ర ప్రభుత్వం వాటా అందకపోవటంతో పేద విద్యార్ధులు ఫీజులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని.. బాధిత తల్లిదండ్రులు స్పందనలో అధికారుల ముందు వాపోయారు. ఇప్పటికే 36మంది కోరుకొండ సైనిక పాఠశాల నుంచి టీసీలు తీసుకుపోయారని తెలియచేశారు.

ఈ సందర్భంగా కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయాలంటూ స్పందనలో కలెక్టర్​కు వినతి పత్రం అందచేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సైనిక పాఠశాల విద్యార్ధులకు ఉపకార వేతనాలు మంజూరు చేయకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ పరిస్థితులలో పాఠశాల ఫీజులు చెల్లించలేక ఏడాది కాలంలో 36మంది విద్యార్ధులు టీసీలు తీసుకున్నారని వాపోయారు. దేశవ్యాప్తంగా జరిగిన పోటీ పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. నేడు ఫీజులు చెల్లించలేక టీసీలు తీసుకుపోవటం బాధాకరమన్నారు.

"గత సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్​ గవర్నమెంట్​ మా పిల్లలకు రావాల్సిన స్కాలర్​షిప్​ను రిలీజ్​ చేయకపోవడం వల్ల ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశాము. ఇప్పటికే 36 మంది పిల్లలు ఫీజులు చెల్లించలేక టీసీలు తీసుకున్నారు. ఇంకా చాలా మంది అదే ఆలోచనలో ఉన్నారు. దేశ సేవ చేయడానికి కష్టపడి పరీక్ష రాసి వచ్చిన విద్యార్థుల కలలు నేడు స్కాలర్​షిప్స్​ రాకపోవడం వల్ల నిర్వీర్యమైపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుకుంటున్నాము. ఈ విషయమై కలెక్టర్​ కూడా సానుకూలంగా స్పందించారు"- సీతారామరాజు, కోరుకొండ సైనిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల సంక్షేమ సంఘం ప్రతినిధి, విజయనగరం

సైనిక రంగంలో ప్రవేశించి దేశానికి సేవ చేయాలన్న తపనతో సైనిక పాఠశాలలో ప్రవేశించిన విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ఉపకార వేతనాలు మంజూరు చేయకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దేశ సేవ చేయాలన్న ఎందరో విద్యార్ధులు కలలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం సైనిక పాఠశాల విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందించి ఆదుకోవాలని వారి తల్లిదండ్రులు కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.