ETV Bharat / state

రైతు బజార్​లో అధికారుల తనిఖీలు

లాక్​డౌన్​ అమలులో ఉన్నందున నిత్యావసర సరకులేమైన ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్న అనుమానంతో అధికారులు తనిఖీలు చేశారు. దుకాణదారులను ధరపై ఆరా తీశారు. చివరకు అసలు విషయం బయటపడింది.

joint collector Inspections at Farmer's Bazaar at vizianagaram

author img

By

Published : Apr 10, 2020, 11:58 PM IST

రైతు బజార్​లో అధికారుల తనిఖీలు.. ఆశ్చర్యం!

విజయనగరంలోని రైతుబజార్లు, దుకాణాల్లో నిత్యావసరాల ధరలను పరిశీలించేందుకు సంయుక్త కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. రైతుబజార్‌లోని వినియోగదారులతో ధరల గురించి మాట్లాడారు. ఆరుబయట దుకాణాల్లోని ధరలపైనా ఆరా తీశారు. కానీ ఒక్క చోట కూడా కూరగాయలు అధిక ధరలకు అమ్మడంలేదని తనిఖీల్లో భాగంగా తెలుసుకున్నారు. ముందస్తు పకడ్బందీ చర్యల వల్లే నిత్యావసరాల ధరల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చేయగలిగామని ఆయన అన్నారు. వ్యాపారులు ధరలు పెంచకుండా ప్రజలకు సహకరిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా వార్డులో పట్టుకున్న 5 పిల్లులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.