cyclone effect in vizianagaram: జవాద్ తుపాను దృష్ట్యా.. విజయనగరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పూసపాటిరేగ, చేపలకంచేరు, పార్వతీపురం మండలాలకు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా.. గజపతినగరం మండలంలో 161 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆండ్ర, తాడిపూడి జలాశయాల నుంచి ప్రధాన గేట్ల ద్వారా 500 క్యూసెక్కుల నీటిని, పెద్దగెడ్డ జలాశయం మూడో గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి:
JAWAD CYCLONE UPDATES IN AP: తీవ్ర తుపానుగా మారనున్న జవాద్ తుపాను.. ఆ మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్