విజయనగరం జిల్లాలో..
విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జగనన్న తోడు పథకం అర్హులైన లబ్ధిదారులకు రెండు కోట్ల 94లక్షల 70 వేల రూపాయల చెక్కును వైకాపా ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభధ్రస్వామి అందజేశారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లాలో 97530 మంది లబ్ధిదారులకు జగనన్న తోడు పథకం కింద 97.53 కోట్ల రూపాయలను అందించినట్లు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు కలెక్టర్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు చెక్కును పంపిణీ చేశారు.
చిరు వ్యాపారులకు అండగా జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చామని.. ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా అన్నారు. గుంటూరు లాంచెస్టర్ రోడ్డులోని 46వ సచివాలయంలో జగనన్న తోడు పథకానికి అర్హులైన లబ్ధిదారులకు ఐడి కార్డులు, చెక్కులను ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: