ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుకను విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 42 లక్షల 32 వేల 322 మందికి ఈ కిట్లను పంపిణీ చేస్తోందన్నారు. 1నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్, ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి నోట్ బుక్స్ ఇస్తున్నట్లు తెలిపారు.
- పార్వతీపురంలో
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యను పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఆయన పార్వతీపురంలో ప్రారంభించారు. పేద విద్యార్థులుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
- సాలూరులో
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సాలూరు పట్టణంలో ఎమ్మెల్యే రాజన్నదొర ప్రారంభించారు. అన్ని రకాల సదుపాయాలతో జగనన్న అందించే ఈ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: