విజయనగరం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారని వివరించారు. అందుకు సంబంధించిన వేదిక ఏర్పాట్ల పనులను జాగ్రత్తగా చూడాలని అధికారులను ఆదేశించారు. రేపు 9 గంటలకు జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం స్వీకరణ, అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తారని వివరించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ స్టాల్‌ను సందర్శించి.. కొవిడ్ వారియర్స్‌ను మంత్రి అభినందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ ప్రభాకరరావుకు సూచించారు.
ఇదీ చదవండి: అమరావతిపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలి: చంద్రబాబు