ఆక్సిజన్ సిలిండర్లకు గిరాకీ పెరిగింది. గతంలో రోజుకు 400 రీ ఫిల్ చేస్తుండగా... రెండు రోజులుగా 500 చొప్పున సిద్ధం చేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. రెండు రోజులుగా ప్రాణవాయువు వినియోగం పెరిగింది. పారిశ్రామికవాడలోని రెండు యూనిట్ల పరిధిలో ముడిసరకును సిద్ధం చేశారు.
అవసరాలకు సరిపడేలా ఏర్పాట్లు చేయాలని జేసీ మహేశ్‌కుమార్ ఆదేశించిన మేరకు.. నోడల్ అధికారి అశోక్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. గంటకు 60 చొప్పున సిలిండర్లను నింపి సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన 30 ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు వాటిని సరఫరా చేస్తున్నారు. సిలిండరు ధర రూ.200లుగా నిర్ధారించాక విశాఖ జిల్లా నుంచి దిగుమతి చేసుకునే వారంతా ఇప్పుడు పారిశ్రామికవాడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: