విజయనగరం జిల్లా సాలూరు మండలం దుద్దు సాగరం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వి, తరలిస్తున్నారు. సాలూరు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్న గుత్తేదారుకు సంబంధించిన వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. గతంలో రంగురాళ్ల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు రెండేళ్ల క్రితం ఆ ప్రదేశంలో తవ్వకాలు నిషేధించారు. నిబంధనలు అతిక్రమించి, ప్రభుత్వ భూమిలోని మట్టిని తరలిస్తున్నా.. అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Cars Scam: అద్దె కార్లను తాకట్టు పెట్టి.. కోట్లు కూడబెట్టి.. చివరకు..!