విజయనగరం జిల్లా హోమ్ గార్డ్స్ ఆర్.ఐ గా పనిచేస్తున్న ఈశ్వరరావు.. విజయనగరం పోలీస్ క్వార్టర్స్ నివాసంలో తన రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009లో ఆర్ఎస్ఐగా కాకినాడలో జాయిన్ అయ్యారు. 2019లో కాకినాడ నుంచి విజయనగరంలో ఆర్ఐగా పోస్టింగ్ అయ్యారు. ఉన్నట్టుండి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు.. ఈశ్వర్‌రావు మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని ఎస్పీ దీపిక పాటిల్ సందర్శించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అధికారులు వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డారా..? లేక మరేదైనా సమస్యలతో ఈ దారుణానికి పాల్పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి :
CPI Ramakrishna on YCP schemes : మీ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో చెప్పగలరా: సీపీఐ రామకృష్ణ