ETV Bharat / state

వాహనాన్ని వదిలి పారిపోలేని పరిస్థితి - గతుకుల రోడ్డును విస్తరణ పేరుతో, పదినెలలుగా పనులు చేస్తూనే ఉన్నారు! - ఆంధ్రప్రదేశ్ గుంతల రహదారుల వార్తలు

Highway and main Roads Damage In Vizianagaram District రాష్ట్రంలో రోడ్ల దుస్థితి బేతాళ కథలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ దురవస్థకు కారణం తెలిసి కూడా సర్కారు, సామాన్యులను నిర్దయగా రోడ్డుపై పడేస్తోంది. విజయనగరం జిల్లా రాజాం ప్రధాన రహదారి పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా మారింది. గతుకుల రోడ్డును బాగు చేయకపోయినా బాగుండేది.. విస్తరణ పేరుతో చేసిన విధ్వంసాన్ని చూసి బిక్కు బిక్కును ఏడ్వడం తప్పా.. పారిపోలేని పరిస్థితి ఆ ప్రాంత ప్రజలకు దాపురించింది.

highway_and_main-_roads_damage_in_vizianagaram_district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 8:25 AM IST

Updated : Nov 28, 2023, 8:37 AM IST

Highway And Main Roads Damage In Vizianagaram District: రాష్ట్రంలో ప్రధాన రహదారులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు ఒక ఎత్తైతే విస్తరణ పేరిట నెలల తరబడి వాహనదారుల కళ్లల్లో దుమ్ముకొడుతున్న రోడ్లు మరో ఎత్తు. విజయనగరం జిల్లా రాజాంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు 20కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైనా మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా మారాయి. రహదారి విస్తరణ పనులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు

Roads Damage In Palkonda Highway: విజయనగరం జిల్లా రాజాంలోని ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో విస్తరణ పేరిట రోడ్డును తవ్వి వదిలేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పట్టణంలోని ప్రధాన రహదారి మొత్తం ధ్వంసమైంది. ముఖ్యంగా అంబేడ్కర్ కూడలి నుంచి డోలపేట తనిఖీ కేంద్రం దాటే వరకూ..అడుగుకో గొయ్యి కనిపిస్తోంది. కొన్నిచోట్ల దాదాపు 10 నుంచి 15 అడుగుల మేరకు పూర్తిగా కోతకు గురై తటాకాలను తలపిస్తున్నాయి. డోలపేట-మారుతీనగర్ కూడలి వద్ద గుంతల్లో వారం రోజుల కిందట ఒక భారీ వాహనం ఇరుకుపోవడంతో రెండు మూడు రోజుల వరకు ట్రాఫిక్​కు ఇబ్బంది తప్పలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో పట్టణానికి చెందిన ఓ వైద్యుడు సొంత నిధులతో నాలుగు భారీ యంత్రాలను తెప్పించి ఆ వాహనాన్ని బయటకు తీయించారు.

Sand Lorry Stuck in Road: ఈనెల 23న ఇదే చోట మరో రెండు ఇసుక లారీలు కూరుకుపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఎన్నో వ్యయప్రయాసలతో వాటిని పక్కకు తీయగానే అదే గోతుల్లో చెరుకు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రాళ్లు తేలిన ప్రదేశంలో గోతులు ఏర్పడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఈ నెల 23న రోడ్ల పరిశీలనకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులను స్థానికులు రహదారి సమస్య పరిష్కారం కాదంటే చెప్పండి తామే మెటల్ వేసుకుంటాం అంటూ పట్టణ ప్రజలు నిలదీశారు.

ఫ్లాట్లు ఇచ్చారు, పాట్లు మిగిల్చారు - ఆటోనగర్ అంటేనే భయపడుతున్న వాహనదారులు

గత ప్రభుత్వ హయాంలో ప్రధాన రహదారులను 80 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు. నిధులు సైతం మంజూరు చేయగా ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తాజాగా చీపురుపల్లి రోడ్డు నుంచి పాలకొండ రోడ్డులోని జీఎంఆర్ఐటీ వరకు కిలోమీటరన్నర రోడ్డు విస్తరణ పనులకు ఈ ఏడాది జనవరిలో శ్రీకారం చుట్టారు. ఆ పనులు నత్తనడకన సాగుతుండగా అంతంత మాత్రంగా ఉన్న రహదారి ఛిద్రమైయిపోయింది. ప్రస్తుత వర్షాలకు మరింత అధ్వాన్నంగా మారటంతో స్థానికులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Road Damage In 2Kilometers: రాజాంలోని ప్రధాన మార్గంలో రెండు కిలోమీటర్లు ప్రయాణించాలంటే రమారమీ గంట సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు పొడవునా అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అత్యవసర సయమంలో ఈ మార్గాన్ని నమ్ముకుంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు.

People Asks Solve The Road Problems: రాజాం నుంచి మూడు మండలాలకు ఇదే ప్రధాన రహదారి. రాజాం- పాలకొండ రోడ్డు మీదుగా భారీ వాహనాలు, పలు రకాల సరుకు రవాణాకు ఇదే ప్రధాన మార్గం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రాజాం-పాలకొండ రోడ్డు గోతులమయంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రహదారి విస్తరణ పనులకు సంబంధించి ప్రభుత్వం గుత్తేదారుడికి చెల్లించాల్సిన 4కోట్ల బకాయిలు చెల్లించకపోవటంతో పనులను నిలిచిపోయాయి. విస్తరణ పనుల్లో జాప్యం నెలకొనగా ఏర్పడిన గుంతల్లో అయినా తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టకపోవటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎంత మొత్తుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవటం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

గుడివాడ గుంతల రహదారులతో ప్రజల అవస్థలు- పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు

వాహనాన్ని వదిలి పారిపోలేని పరిస్థితి

Last Updated : Nov 28, 2023, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.