Justice Krishnamohan: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ దంపతులు... విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆలయం వద్ద న్యాయమూర్తిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు అంకురార్పణగా వేసిన పందిరి రాటను ఇరువురూ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయి కల్యాణ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: