ETV Bharat / state

అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు - heavy rains latest news update

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. వర్షాలు ఖరీఫ్​ సాగుకు ఊపిరి పోశాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

heavy rains in vizianagaram
అల్పపీడన ప్రభావంతో విజయనగరంలో విస్తారంగా వర్షాలు
author img

By

Published : Sep 14, 2020, 2:05 PM IST

అల్పపీడన ప్రభావంతో విజయనగరంలో విస్తారంగా వర్షాలు

ఎగువన కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్ట్​లో వరదనీరు చేరుతోంది. జలాశయం సాధారణం నీటి మట్టం 2.509 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.021టీఎంసీలకు చేరింది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటకు ఊపిరిపోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విజయనగరం రెవిన్యూ డివిజన్ లోని, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, విజయనగరం, బొండపల్లి, మెంటాడ, జామీ, శృంగవరపుకోట, లక్కవరపుకోట మండలాల్లో ఎండిపోతున్న వరిపైర్లకు ఊరట లభించింది.

ఏ ప్రాంతంలో ఎంత..?

జిల్లా వ్యాప్తంగా 22.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 50.3మిల్లీమీటర్లు, డెంకాడలో 39.2, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెర్లాంలో 35.2, లక్కవరపుకోటలో 34.2, గరివిడి, చీపురుపల్లి, వేపాడ మండలాల్లో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లిమర్ల 31.8 మిల్లీ మీటర్లు, శృంగవరపుకోటలో 30, విజయనగరంలో 28,6, జామీలో 26.2, సీతానగరం, బొబ్బిలి మండలంలో 22మిల్లీమీటర్లు వర్షం కురిసింది. గుర్లలో 21.8, బొండపల్లి, గుమ్మలక్ష్మీపురం, గురుగుబిల్లి మండలాల్లో 19మిల్లీమీటర్లు, బలిజపేటలో 18.6, మెంటాడ, గజపతినగరం మండలాల్లో 17మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

ఇవీ చూడండి:

తల్లి మృతి చెందిన గంట వ్యవధిలోనే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.