గత ప్రభుత్వ హయాంలో వైద్యం నిర్లక్షానికి గురైందని.. ఆ లోటును భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్,పుష్పశ్రీవాణి, పశుసంవర్ధక సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజుతో కలిసి విజయంనగరంలోని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. రూ.45 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు.
పట్టణాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అధికారులు ప్రతిపాదించిన వాటిలో అనువైన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చూడండి: 'తిరుమల కొండపైనే మద్యం అమ్మేలా ఉన్నారు!'