ఏఆర్ పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు, వ్యాయామం చేసుకునేందుకు గౌతమబద్ధ బ్యారక్‌తో పాటు, ఓ వ్యాయామశాలను జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ వాటిని నిర్మించామని చెప్పారు. బయట ప్రాంతాల నుంచి విధులు నిర్వహించేందుకు వచ్చే మహిళా హోం గార్డులు జిల్లా కేంద్రంలో వసతి లేక ఇబ్బందులు పడేవారని .. వారి కోసం అన్ని సౌకర్యాలతో విశ్రాంతి గదిని ఏర్పాటు చేశామన్నారు. బ్యారక్‌ను నిర్మించడంలో శ్రమదానం చేసిన పోలీసులను ఎస్పీ.. నూతన వస్త్రాలు బహుకరించి అభినందించారు.
ఇదీ చదవండి: కేసుల పెట్టటం తప్ప మరో పనిలేదు: శైలజానాథ్