కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దాతృత్వంతో ముందుకు రావటాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభినందించారు. ప్రజలు లాక్డౌన్ నిబంధలను పాటిస్తూ... కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
విజయనగరం రాజీవ్ స్టేడియంలో రోటరీ, లీ ప్యారడైజ్ కన్వెన్షన్ సంస్థల సహకారంతో 320 మంది కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ... లాక్డౌన్ సమయంలో పేదవారికి నిత్యావసర వస్తువులు అందాలనే తలంపుతో ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.