ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. యూఎఫ్బీయూ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె చేపట్టారు. సమ్మెల్లో భాగంగా మొదటి రోజు నిరసన ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఎస్బీఐ ప్రధాన శాఖ కోట జక్షన్ నుంచి మూడు లాంతర్లు, పెద్దమార్కెట్ మీదుగా గంటస్తంభం వరకు ర్యాలీ సాగింది. అనంతరం గంటస్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే.. ఉద్యోగులకే కాకుండా ఖాతాదారులకు పలు ఇబ్బందులు తప్పవన్నారు. కనీస ఖాతా నిల్వలు పెంచటమే కాకుండా... డిపాజిట్ల వడ్డీ రేట్లు తగ్గి, రుణాలపై పెద్ద మొత్తంలో వడ్డీల భారం పెరగనుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి...