విజయనగరంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని గంటస్తంభం సమీపంలో ఉన్న రవి జ్యూయలర్స్‌లో 5 కిలోల బంగారం అభరణాలను దొంగలు దోచుకెళ్లారు. దుండగలు..పై కప్పు నుంచి దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. షాపుకి మంగళవారం సెలవు కావటంతో ఈ ఘటనా ఆలస్యంగా వెలుగుచూసింది. దుకాణం యజమాని ఇవాళ ఉదయం షాపు తెరవగా.. ఆల్మరాల్లోని పెట్టెలు ఖాళీ ఉన్నాయి. దీంతో దోపిడీ జరిగినట్లు గుర్తించిన అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
యజమాని ఫిర్యాదుతో విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ శ్రీనివాసరావు.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మరోవైపు మరల్సి.. బంగారాన్ని దోచుకెళ్లిన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా దొంగతనం జరిగిన రవి జ్యూయలర్స్.. ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి: Accident : అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి