విజయనగరంలో రెండున్నర కిలోల బంగారం పట్టివేత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయనగరం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా కేంద్రంలోఇవాళ చేపట్టిన సోదాల్లో సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ల నుంచి సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సంబంధించిన సరైన ధృవపత్రాలు చూపనందున వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని అమృత్సర్ వాసులుగా గుర్తించారు.