విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని వేపాడ మండలం మారిక గిరిజన గ్రామానికి చెందిన గర్భిణిని డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవించింది. కరకవలస పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన మారిక కొండల్లో ఉంటుంది. వీరికి కనీస అవసరాలు రావాలన్నా ఏడు కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది.
గ్రామానికి చెందిన గమ్మెల బిమలకు పురిటినొప్పులు రావడంతో స్థానికులు డోలి కట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నొప్పులు ఎక్కువై ప్రసవించింది. ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీ బిడ్డలను మోసుకుంటూ తీసుకెళ్లి.. ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: