విజయనగరం జొన్నవలస గ్రామంలో గౌరీదేవి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ ప్రజలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. జానపద నృత్యాలు, తప్పిటగుళ్లు, కోయ నృత్యాలు, పులివేశాలు, డాన్సులతో కళాకారులు ప్రదర్శన చేశారు. ఊరేగింపు నిర్వహించారు. వందేళ్లుగా ఈ వేడుక నిర్వహణ ఆనవాయితీగా వస్తోందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: